విద్యారంగ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ధ‌ర్నా

by Ratna Kumari |

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం జగిత్యాల కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

విద్యారంగ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ధ‌ర్నా
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం జగిత్యాల కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. "హలో విద్యార్థి.. చలో కలెక్టరేట్" నినాదంతో కలెక్టరేట్‌కు చేరుకున్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అక్రమ్ మాలిక్, మంద రాకేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు మంత్రిని నియమించి విద్యాశాఖకు మాత్రం ప్రత్యేక మంత్రిని నియమించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను** విడతల వారీగా కాకుండా ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రణయ్, సాయి, వినీత్, రోహిత్, చందు, వరుణ్, కార్తీక్ తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story