- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా అన్నీ పూర్తవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర అసెంబ్లీ భవనంలో ప్రస్తుతం చేపడుతున్న సెంట్రల్ హాల్ నిర్మాణం, ఇతర నిర్మాణ, మరమ్మత్తు పనులను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ భవనంలో ప్రస్తుతం చేపడుతున్న సెంట్రల్ హాల్ నిర్మాణం, ఇతర నిర్మాణ, మరమ్మత్తు పనులను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ ఇతర అసెంబ్లీలకు ఆదర్శంగా ఉండాలని అధికారులకు సీఎం తెలిపారు. గురువారం సీఎం అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ భవనంలో సెంట్రల్ హాల్ విస్తరణ పనులు, అక్కడ నిర్మించబోయే సీటింగ్ డిజైన్లు, ఏర్పాట్లపైన అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. సీఎం చాంబర్ విస్తరణ పనుల వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం, శాసన సభా వ్యవహారాల మంత్రి, సీఎస్ చాంబర్ల విస్తరణ పనులను రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆర్కిటెక్చర్ డిజైన్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనితో పాటుగా కొత్తగా నిర్మిస్తున్న కిచన్, వాష్ రూంలను ఆయన పరిశీలించిన సీఎం కిచన్ లో చిమ్మీలు బయటకు కనపడొద్దని అదేశించారు. అసెంబ్లీ బయట ఉన్న పాత మీడియా పాయింట్ షెడ్డు ను తీసివేయాలని, అక్కడున్న చెట్టును కాపాడేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని ఫౌంటన్ ను రేవంత్ రెడ్డి పరిశీలించారు. కౌన్సిల్ లోని సీఎం చాంబర్ లో స్వల్ప మార్పులు చేయాలని, సందర్శకులకు మరింత వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో శాసన స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జై వీర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి, అధికారులు, శాసన సభ సిబ్బంది పాల్గొన్నారు.






