మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదు

by Ratna Kumari |

యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగు వినయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదు
X

దిశ, పర్వతగిరి : యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగు వినయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే వ్యవహారంలో బాధితురాలిని దూషించి, బెదిరించారనే ఆరోపణలపై వినయ్ బావ భాషబోయిన వీరస్వామిపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలు గుండా మానస ఇచ్చిన ఫిర్యాదు, ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, వివాహం చేసుకుంటానని చెప్పి తనను నమ్మించి మోసం చేశారని, నిలదీయగా వినయ్‌తో పాటు అతని బావ వీరస్వామి కూడా ఫోన్‌లో, ప్రత్యక్షంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. తన కుటుంబ సభ్యులను కూడా అవమానించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రధాన నిందితుడు గొడుగు వినయ్‌తో పాటు అతనికి సహకరించి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భాషబోయిన వీరస్వామిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story