ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: ఏపీ రైతు సంఘం

by Vemula.Srinu Prasad |

నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని 24న విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.....

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: ఏపీ రైతు సంఘం
X

దిశ, ఏలూరు ప్రతినిధి: నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని 24న విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం అన్నే భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ 2014 నుండి దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీక్ ఆయ్యాయని చెప్పారు.

నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.నీట్ పేపర్ లీకేజ్ కు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాలని గత నెల రోజులుగా ఆందోళనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పారు. పర్యావరణ వేత్త సోనం వాంగ్ చుక్ నేటికి హాస్పిటల్లో ఆమరణదీక్ష కొనసాగిస్తూన్నట్లు ప్రకటించారన్నారు 20వ తేదీ లక్షలాది మంది విద్యార్థుల శాంతియుతంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం కదం తొక్కిన విద్యార్థి, యువతపైన అత్యంత అమానవీయంగా లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించి వేలాది మంది విద్యార్థులపై ఢిల్లీ పోలీలు వ్యవహరించిన తీరు అత్యంత కిరాతకం అని విమర్శించారు.ప్రజాస్వామ్యంను కాపాడాలని, దేశ విద్యావ్యవస్థలో సమూలమార్పులు కావాలని, నీట్ పరీక్షా విధానం రద్దుచేసి రాష్ట్రాల వారీగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలిని, నీట్ తదితర పరీక్షా పత్రాల లీకేజ్ కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 24వ తేదీన తలపెట్టిన దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Next Story