హెల్మెట్ ధరిస్తేనే ప్రాణాలు సురక్షితం : ట్రాఫిక్ డీసీపీ

by Batti.Sumithra |

బైక్ రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ్ సూచించారు.

హెల్మెట్ ధరిస్తేనే ప్రాణాలు సురక్షితం : ట్రాఫిక్ డీసీపీ
X

దిశ, మొయినాబాద్ : బైక్ రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ్ సూచించారు. గురువారం మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్ నగర్ పాత చౌరస్తా వద్ద వాహనదారులకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. క్రమశిక్షణ పాటించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ సిగ్నల్స్, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బి.సతీష్ తో పాటు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story