సీఎం విజ‌య్ కి షాక్‌..రిలీజైన తొలిరోజే "జ‌న నాయ‌గ‌న్" పై ట్రోలింగ్!

by velandi.Saikiran |

సీఎం విజ‌య్ కి షాక్ త‌గిలింది. రిలీజైన తొలిరోజే "జ‌న నాయ‌గ‌న్" పై ట్రోలింగ్ చేస్తున్నారు.

సీఎం విజ‌య్ కి షాక్‌..రిలీజైన తొలిరోజే జ‌న నాయ‌గ‌న్ పై ట్రోలింగ్!
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్ గురువారం రిలీజ్ అయింది. వాస్తవానికి మొన్నటి సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా... వాయిదా పడుతూ వచ్చింది. చివరికి అన్ని ఆటంకులను తొలగించుకొని రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాను గ్రైండర్ లో వేసి మిక్స్ చేసి... జన నాయగన్ పేరుతో రిలీజ్ చేశానని సెటైర్లు పేల్చుతున్నారు.

50% మాత్రమే ఇందులో నుంచి కథను తీసుకున్నామని చెప్పి... జనాలను మోసం చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య సినిమానే అచ్చు బుద్ధి దించేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టి రచ్చ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ హీరోగా చేయగా... పూజా హెగ్డే హీరోయిన్ గా మెరిసారు. ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహించగా అనిరుధ్ మ్యూజిక్ అందించారు. KVN ప్రొడక్షన్ లో ఈ సినిమా వచ్చింది.

Next Story