- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.

దిశ కొణిజర్ల జూలై 23: ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామ సమీపంలో గల బోనకల్ బ్రాంచ్ కెనాల్ బీబీసి ని గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ నుంచి గోదావరి జలాలను నాగార్జున సాగర్ ద్వారా వైరా రిజర్వాయర్ కు తరలించినట్లు పేర్కొన్నారు. తాగునీటి అవసరాల నిమిత్తం అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపాలని అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మాలో రామదాసు నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాస చారి తహసీల్దార్ ఎన్ అరుణ తదితరులు పాల్గొన్నారు.






