తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ.. నిందితుడు అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-23 12:52:46  IST  )

తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ చేసిన విషయం తెలిసిందే. అయితే నిందితుడిని పోలీసులు గుర్తించారు. ...

తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ.. నిందితుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో ఆంజనేయ స్వామి విగ్రహం(Lord Anjaneya Statue) చోరీ చేసిన విషయం తెలిసిందే. అయితే నిందితుడిని పోలీసులు గుర్తించారు. అనంతరం అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం టి. నగరపాలెం గ్రామానికి చెందిన పొట్నూరు యశ్వంత్ అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అసలు హనుమాన్ విగ్రహాన్ని యశ్వంత్ ఎందుకు చోరీ చేశారు. దీని వెనుక ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే పలువురు రాజకీయ నాయకులతో దిగిన యశ్వంత్ ఫొటోలు చర్చగా మారాయి

ఆంజనేయ విగ్రహం పున:ప్రతిష్టాపన

మరోవైపు ఆంజనేయ విగ్రహాన్ని తిరుమలలో పున:ప్రతిష్టించారు. తిరుమల ఘాట్ రోడ్ 7వ మైలు దగ్గర ఉన్న ఈ విగ్రహాన్ని యశ్వంత్ చోరీ చేశారు. దీంతో పోలీసులు 14 గంటల్లోనే విగ్రహాన్ని గుర్తించారు. విగ్రహం చోరీకి గురైన స్థలంలో అర్చకులు పుణ్యావాచనం, జల సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ మధ్య ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పున:ప్రతిష్టించారు.

Next Story