- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు దంపతులను సన్మానించిన కలెక్టర్..!
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా రైతు దంపతులను శాలువాతో సన్మానించి, నీటి కుంట పనులకు భూమి పూజ చేశారు.

దిశ, కుబీర్ : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా రైతు దంపతులను శాలువాతో సన్మానించి, నీటి కుంట పనులకు భూమి పూజ చేశారు. గురువారం కుబీర్ మండలంలోని డోడర్ణ గ్రామంలో నీటి కుంట పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. వ్యవసాయ క్షేత్రంలో నీటి కుంట పనులు చేపడుతున్న రైతు దంపతులను అభినందించారు. వ్యవసాయానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ భవేష్ మిశ్రా అడిగి తెలుసుకున్నారు. వానాకాలంలోనూ, రబీలోనూ సాగు చేసే పంటల వివరాలు, యూరియా వాడకం, బుకింగ్ చేయడం తెలుసా అని ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలసిరి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల పెంపు కోసం చేలల్లో నీటి కుంటలు, ఇళ్ల ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్, డీఆర్‌డీవో విజయలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీదేవి, సర్పంచ్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.






