- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ స్మృతికేంద్రం వద్ద ఇండి కూటమి నేతల నివాళి
నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా.. ఇండియా కూటమి నేతలంతా గాంధీ స్మృతికేంద్రం వద్ద నివాళులు అర్పించారు.

దిశ, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా.. ఇండియా కూటమి నేతలంతా గాంధీ స్మృతికేంద్రం వద్ద నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం రాహుల్ గాంధీ నివాసంలో భేటీ అనంతరం.. జంతర్ మంతర్ లో కేంద్రానికి వ్యతిరేకంగా, నీట్ పేపర్ లీక్ పై నిరసనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతివ్వాలని ఇండి కూటమి నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాలని బయల్దేరగా.. అందుకు పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో ఎంపీల బస్సు నేరుగా గాంధీ స్మృతి కేంద్రానికి పయనమైంది. అక్కడ కూడా పోలీసులు బస్సును అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. కాసేపటికి పోలీసులు బస్సును వదలడంతో.. గాంధీ సమాధి వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. దేశంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారన్నారు. మహాత్మాగాంధీ దేనికోసం పోరాడారు.. మనదేశం అనుసరిస్తున్న విధానమేమిటంటూ ఆవేదన చెందారు. గాంధీ పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని యువత ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇది చాలా దారుణమని ఆమె వ్యాఖ్యలు చేశారు.






