- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్
పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

దిశ, లక్షెట్టిపేట : పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం సందర్శించిన ఆయన అత్యవసర విభాగం, సాధారణ వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఓపీ రిజిస్టర్ అంశాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం అయినందున అంటువ్యాధుల నియంత్రణ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు.
అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ఆస్పత్రి పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్‌తో కలిసి మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించి, వాటిని త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వంటశాలను పరిశీలించి, వంట సిబ్బంది ఆహారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, ధాన్యాలు, నిత్యావసర సరుకులను వినియోగించాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






