"టాక్సిక్" సినిమాలో న‌య‌న‌తార పాత్ర ఇదే..!

by velandi.Saikiran |

"టాక్సిక్" సినిమాలో న‌య‌న‌తార పాత్రపై సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

టాక్సిక్ సినిమాలో న‌య‌న‌తార పాత్ర ఇదే..!
X

దిశ‌, వెబ్ డెస్క్: రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా "టాక్సిక్". గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యష్ హీరోగా చేస్తుండగా.. మొత్తం ఐదుగురు హీరోయిన్లు సందడి చేయనున్నారు. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిన్నపాటి టీజర్ తో పాటు రెండు పాటలు కూడా వచ్చాయి. ఈ మూడు అప్డేట్ లలో అన్ని బోల్డ్ సీన్లే కనిపించాయి. ఇక మొన్నటి సెకండ్ సింగిల్స్ లో... నయనతార కూడా కనిపించారు.

ఇందులో సిగరెట్ కాల్చుతూ.. ఓ లేడీ విలన్ లాగా మెరిసి, అందరిని ఆకట్టుకున్నారు. దీంతో ఈ సినిమాలో నయనతార పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని చర్చ జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం యష్ సోదరిగా నయనతార కనిపించబోతున్నారట. అయితే ఇందులో ఆమెది పూర్తిగా నెగిటివ్ రోల్ అని అంటున్నారు. మరి యష్ ను ఆమె వెన్నుపోటు పొడుస్తారా..? లేక ఈ ఇద్దరే విలన్ల పంతం పడతారా ? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమా ఆగస్టు 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో రిలీజ్ కానుంది.

Next Story