- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ డీఏపీ సూత్రధారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
నకిలీ డీఏపీ ఎరువుల వ్యవహారంలో సూత్రధారులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, నాగర్‌కర్నూల్ : నకిలీ డీఏపీ ఎరువుల వ్యవహారంలో సూత్రధారులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తక్కువ విలువ ఉన్న నకిలీ డీఏపీని అధిక ధరలకు విక్రయించి రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే దళారులకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు.
మొక్కజొన్న కొనుగోలు, గన్నీ బ్యాగుల సరఫరా, రవాణా చార్జీల వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నకిలీ డీఏపీ దళారులపై చర్యలు తీసుకోకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట వంటావార్పు నిర్వహించి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధుల అండతో గన్నీ బ్యాగులను బ్లాక్‌లో విక్రయిస్తూ ఒక్కో బ్యాగుపై రూ.5 నుంచి రూ.15 వరకు అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. యాసంగి వరి ధాన్యం రవాణాకు సంబంధించిన ట్రాక్టర్ చార్జీలు ఇప్పటికీ రైతులకు చెల్లించలేదని పేర్కొన్నారు. మిల్లు యాజమాన్యాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై యాసంగి ధాన్యంలో క్వింటాల్‌కు 5 నుంచి 10 కిలోల వరకు కోత విధించి రైతులను నష్టపరిచారని ఆరోపించారు. ఈ విషయమై పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
తెలంగాణ నీటి హక్కులను ప్రభుత్వం కాపాడడం లేదని ఆరోపణ..
తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని మర్రి జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.






