- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత..
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాసం వద్ద గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాసం వద్ద గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ (NEET) పేపర్ లీకేజీతో మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థులకు నివాళులర్పించడంతో పాటు, ఆందోళనల వేళ పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారికి మద్దతుగా ‘ఇండి’ (INDIA) కూటమి నేతలు గాంధీ స్మృతి భవన్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శనకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాహుల్ నివాసంలో సమావేశమైన కూటమి అగ్రనేతలు.. దేశవ్యాప్తంగా విద్యార్థులకు పూర్తి బాసటగా నిలవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం రాహుల్ గాంధీతో పాటు విపక్ష ఎంపీలు, నాయకులంతా ఒకే బస్సులో నివాసం నుంచి గాంధీ స్మృతికి ర్యాలీగా బయలుదేరారు.
పోలీసుల బారికేడ్లు.. వర్షం వచ్చినా తగ్గని నిరసన
మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు రాహుల్ నివాసం వెలుపల భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి మోహరించారు. ఢిల్లీలో వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నప్పటికీ నేతల నిరసన వేడి తగ్గలేదు. పోలీసుల మోహరింపుపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. ‘పోలీసులను చూపి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. కానీ మేము దేనికీ భయపడేది లేదు. మేము ఎక్కడికి వెళ్లినా ఈ దేశం మనదే’ అని ఆమె వ్యాఖ్యానించారు.
విద్యార్థులు ఒంటరి కాదు: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ‘విద్యార్థులు ఎవరూ ఒంటరి కాదు. వారందరికీ విపక్షాలన్నీ పూర్తి అండగా ఉంటాయి. పేపర్ లీక్ వల్ల బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థులకు నివాళులర్పించేందుకు, లాఠీచార్జీలో గాయపడిన వారి కోసం గాంధీ స్మృతి భవన్‌కు శాంతియుత నిరసనగా వెళ్తున్నాం’ అని స్పష్టం చేశారు.






