- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాక్ తో దాడి చేసి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన దుండగులు
చందానగర్ లో అర్ధరాత్రి దోపిడీ యత్నం కలకలం రేపింది. మంచినీళ్లు కావాలని అడిగి గుడిసెలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు, బాలుడి పై కత్తితో దాడి చేసి మొబైల్ ఫోన్ దోచుకుని పరారయ్యారు.

దిశ, శేరిలింగంపల్లి : చందానగర్ లో అర్ధరాత్రి దోపిడీ యత్నం కలకలం రేపింది. మంచినీళ్లు కావాలని అడిగి గుడిసెలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు, బాలుడి పై కత్తితో దాడి చేసి మొబైల్ ఫోన్ దోచుకుని పరారయ్యారు. గత రాత్రి సుమారు 12 గంటల సమయంలో చందానగర్ హుడా కాలనీ రైల్వే పట్టాల సమీపంలోని గుడిసెలో ఉన్న 16 ఏళ్ల జాన్ సయ్యద్ వద్దకు స్కూటీ పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మంచినీళ్లు ఇవ్వాలని అడగడంతో బాలుడు వాటర్ బాటిల్ ఇచ్చాడు. అనంతరం బయటకు వెళ్లిన ఇద్దరు దుండగులు మద్యం సేవించిన ఇద్దరూ తిరిగి గుడిసె వద్దకు వచ్చారు.
బాలుడిని చాకుతో దాడి చేశారు. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో జాన్ సయ్యద్ గట్టిగా కేకలు వేయడంతో, అక్కడే ఉన్న కత్తితో అతని చేతి పై దాడి చేసి గాయపరిచారు. అనంతరం మొబైల్ ఫోన్ తీసుకుని అదే స్కూటీ పై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రాబరీ కేసు నమోదు చేసి, నిందితుల కోసం చందానగర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వారం క్రితం ఈ ప్రాంతంలో రోడ్ పక్కన ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న తల్లి పక్కనుంచి చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది. తాజాగా అదే ప్రాంతంలో సెల్ ఫోన్ కోసం మారణాయుధాలతో బెదిరించారు.






