అద‌ర‌గొట్టిన భార‌త బౌల‌ర్లు...జింబాబ్వే స్కోర్ ఎంతంటే?

by velandi.Saikiran |

హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20 నేపథ్యంలో జింబాబ్వే తేలిపోయింది.

అద‌ర‌గొట్టిన భార‌త బౌల‌ర్లు...జింబాబ్వే స్కోర్ ఎంతంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20 నేపథ్యంలో జింబాబ్వే తేలిపోయింది. భారత బౌలర్ల దెబ్బకు కకావికలమైంది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన జింబాబ్వే, 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కాగా.. వెస్లీ మధవెరె 39 పరుగులు చేయగా, రయాన్ బర్ల్ 26 పరుగులతో రాణించే ప్రయత్నం చేశారు. కెప్టెన్ సికందర్ రాజాతో పాటు మిగిలిన వారంతా చేతులెత్తేశారు. ఇక భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. శివమ్ దుబే, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు. ఇక 126 ప‌రుగులు సాధిస్తే, భార‌త్ విజ‌యం సాధించ‌నుంది. మ‌రి భార‌త బ్యాట‌ర్లు ఎలా రాణిస్తారో చూడాలి.

Next Story