చిన్న వయసులోనే తెల్ల జుట్టా? నల్ల నువ్వులతో చెక్ పెట్టండిలా..!

by Javid Pasha |

నల్ల నువ్వుల్లో విటమిన్ ఇ ,సెసమిన్, సెసమోలిన్, సెసమాల్ వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి

చిన్న వయసులోనే తెల్ల జుట్టా? నల్ల నువ్వులతో చెక్ పెట్టండిలా..!
X

దిశ, ఫీచర్స్ : చిన్న వయసులోనే జుట్టు తెల్లబడే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే నల్ల నువ్వులను ఆహారంగా వాడండి అంటున్నారు సాంప్రదాయ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు. ఎందుకంటే.. వీటిలోని పోషకాలు ముందస్తుగా జట్టు తెల్లబడటాన్ని (premature greying) నివారిస్తాయని చెబుతున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్ల నువ్వులు తెల్లజుట్టు సమస్యను నివారిస్తాయని భారతీయ ఆయుర్వేద నిపుణులే కాదు.. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్‌లో కూడా ఇదే పేర్కొన్నారు. ఇవి చర్మం పొడిబారడం, ఎక్జిమా వంటి సమస్యలకు కూడా ఉపయోగపడతాయి. నల్ల నువ్వుల్లో ఐరన్, కాపర్, జింక్, అమినో ఆమ్లాలు, మెలానిన్ (జుట్టు రంగుకు సంబంధించిన పిగ్మెంట్) పుష్కలంగా ఉంటాయి. ఇవి యూవీ (UV) కిరణాల నుంచి కూడా రక్షణ ఇస్తాయి.

ఫ్రీ రాడికల్స్‌ ప్రభావం

నిజానికి వృద్ధాప్య దశకు ముందే తెల్లజుట్టు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్, కాలుష్యం, అధిక మానసిక ఒత్తిడి, స్మోకింగ్, సూర్యరశ్మి, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఫ్రీ రాడికల్స్‌(Free Radicals)ను పెంచి జుట్టు మూలాలను దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే నల్ల నువ్వుల్లో విటమిన్ E , సెసమిన్, సెసమోలిన్, సెసమాల్ వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని ఆహారంగా తీసుకోవడంవల్ల ఈ ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గించి, జుట్టు తెల్లబడకుండా సహాయపడతాయని చెబుతున్నారు.

ఎలా వాడాలి?

రోజుకు 1 టేబుల్ స్పూన్ (సుమారు 10-15 గ్రాములు) నల్ల నువ్వులను సలాడ్, సూప్, కూరల్లో చల్లుకొని తినవచ్చు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరేచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన మోతాదు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే విటమిన్ B12 లోపం కూడా తెల్లజుట్టు త్వరగా రావడానికి కారణం కావచ్చు కాబట్టి, అలాంటి లోపం ఉందని గుర్తించినవారు 1-2 టీస్పూన్ల క్లోరెల్లా పౌడర్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అయితే వృద్ధాప్య దశకు ముందు జుట్టు తెల్లబడటం ప్రారంభమైన వారికి ఈ చిట్కాలు ఉపయోగపడవచ్చు. అంతేకానీ తెల్లబడ్డ జుట్టును రివర్స్ చేయవు. కాబట్టి ఎక్కువ సమస్య ఉంటే లేదా ఏవైనా అనుమానాలు ఉంటే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తు్న్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story