- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓకే పేరు.. ఏడు ఊర్లు
ఒకే ఒక పేరుతో రెండు లేదా మూడు గ్రామాలు ఉండడం సహజం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం ఒకే ఒక్క పేరుతో ఆరు గ్రామాలు ఉండడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది.

దిశ, నల్లగొండ బ్యూరో : ఒకే ఒక పేరుతో రెండు లేదా మూడు గ్రామాలు ఉండడం సహజం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం ఒకే ఒక్క పేరుతో ఏడు గ్రామాలు ఉండడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఆ పేరే తిరుమలగిరి. ఈ పేరుతో రెండు మండల కేంద్రాలతో పాటు గ్రామాలు కూడా ఉన్నాయి. విభజించబడిన మూడు జిల్లాల్లోనూ ఈ గ్రామాలు ఉండడం వింతగా ఉంది. ఈ గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలిద్దాం.
సూర్యాపేట జిల్లాలో..
ప్రస్తుతం సూర్యపేట జిల్లా చివ్వెంల మండలంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై తిరుమలగిరి అనే గ్రామం ఉంది. దాంతోపాటు చాలా కాలంగా పరిపాలన కేంద్రంగా తిరుమలగిరి పేరుతో మండల కేంద్రం ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీ కేంద్రంగా కూడ ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో....
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం మండలం లో కూడా తిరుమలగిరి అనే పేరుతో ఓ గ్రామం ఉంది. ఈ గ్రామానికి స్థానికంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. స్థానిక జీవనశైలి పరంగా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది.
నల్లగొండ జిల్లాలో
నల్గొండ జిల్లాలో ఏకంగా నాలుగు గ్రామాలు తిరుమలగిరి పేరుతో ఉన్నాయి. తిరుమలగిరి( సాగర్ ) అనే పేరుతో మండల కేంద్రం ఉంది. నార్కెట్పల్లి మండలంలో తిరుమలగిరి అనే గ్రామం ఉంది. నాంపల్లి మండలంలో తిరుమలగిరి అనే గ్రామం ఉంది. దేవరకొండ నియోజకవర్గం లోని పీఏ పల్లి మండలంలో కూడా తిరుమలగిరి గ్రామం ఉంది. ఒక్క జిల్లాలోనే తిరుమలగిరి పేరుతో నాలుగు గ్రామాలు ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తంగా సూర్యాపేట జిల్లాలో రెండు, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు నల్లగొండ జిల్లాలో నాలుగు కలిపి ఏడు తిరుమలగిరి పేరుతో ఉన్నాయి. ఒకే పేరుతో ఇన్ని గ్రామాలు కొనసాగడం తెలంగాణలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అరుదైన విషయమే.






