పీసీ ఘోష్ రిపోర్టును చెత్తబుట్టలో వేయొచ్చు.. KCR తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-22 06:28:28  IST  )

కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టును చెత్తబుట్టలో వేయొచ్చని కేసీఆర్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పీసీ ఘోష్ రిపోర్టును చెత్తబుట్టలో వేయొచ్చు.. KCR తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ నివేదిక విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌ (KCR), మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఊరట కల్పిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. తీర్పు వెలువడిన అనంతరం కేసీఆర్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు (Gandra Mohan Rao) మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ తీర్పుతో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును ఇక చెత్తబుట్టలో పడేయవచ్చని ఆయన అన్నారు. కమిషన్ విచారణలో సెక్షన్-8 నిబంధనలు పాటించలేదని కోర్టు గుర్తించిందని తెలిపారు. అయితే, కమిషన్ ఏర్పాటును మాత్రం కోర్టు సమర్థించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని సీబీఐ విచారణ (CBI Inquiry) జరపడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసిందని ఆయన వెల్లడించారు. హైకోర్టు తీర్పుతో కేసీఆర్‌కు న్యాయపరంగా పెద్ద ఊరట లభించిందని గండ్ర మోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట.. పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు

దుస్తుల కాంట్రాక్టులు ‘టెస్కో’కే ఇవ్వండి.. PMU నోటిఫికేషన్‌ను రద్దు చేసిన హైకోర్టు

Next Story