- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సగం సినిమా అయిపోయింది: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అంతా మాఫియా రాజ్యం నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్‌కు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాడని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో వేల ఇళ్లు కూల్చేశారని అన్నారు. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడటం, కేసులు పెట్టడం తప్ప ఏమీ తెలియదని విమర్శించారు. రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని నినదించారు. మొత్తం తెలంగాణ ప్రజలు అందరూ ఇదే కోరుకుంటున్నారని గుర్తుచేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. ఈ విషయం ప్రజలు అందరికీ తెలిసిపోయి విసుక్కుంటున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సినిమా సగం అయిపోయిందని, ఇంకా సగమే ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా ఒక సినిమా ఫెయిలైతే నిర్మాత ఒక్కరే నష్టపోతారు.. కానీ రేవంత్ రెడ్డి సినిమాలో మొత్తం తెలంగాణ ప్రజలు అందరూ నష్టపోతున్నారని అన్నారు. నియోజకవర్గంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఒక్క ఇందిరమ్మ ఇళ్లు అయినా కట్టించారా? అని ప్రశ్నించారు.






