- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణం.. మనసులో మాట చెప్పిన నందిని రెడ్డి
ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చిన ఏదీ సరైనదిగా అనిపించకపోవడంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానని నందిని రెడ్డి చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహిళా దర్శకురాలు నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. ఈ సినిమా తాజాగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో నందిని రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా నందిని రెడ్డి మాట్లాడుతూ, "నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజ్ రోజుల్లో నేను కూడా ఒకరిని ప్రేమించాను. అయితే ఆ సమయంలో పెళ్లి చేసుకునే పరిస్థితులు లేకపోయాయి. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. నా ఆలోచనలను గౌరవిస్తూ, జీవితాంతం నాతో కలిసి నడిచే వ్యక్తి నాకు ఎదురుకాలేదు. మధ్యలో ఎన్నో పెళ్లి సంబంధాలు కూడా వచ్చాయి. కానీ వాటిలో ఏదీ నాకు సరైనదిగా అనిపించలేదు. అలా కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నందిని రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






