- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుర్ఖా తీయమన్నందుకు నీట్ పరీక్షను తిరస్కరించిన విద్యార్థిని
రాజస్థాన్ అజ్మీర్‌లో నీట్ పరీక్షా కేంద్రం వద్ద బురఖా ధరించి పరీక్ష రాసేందుకు సిబ్బంది అభ్యంతరం తెలపడంతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది ఓ విద్యార్థిని.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రారంభమైంది ఉదయం 11 గంటల నుంచి మ.1:30 వరకు పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులకు అనుమతి ఇచ్చారు. నిమిషం నిబంధన కారణంగా పలు చోట్ల ఆలస్యంగా వచ్చిన కొందరు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోపలకి అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నీట్ ఎగ్జామ్‌కు బుర్ఖాతో వెళ్లేందుకు సిబ్బంది నిరాకరించడంతో ఓ విద్యార్థిని ఏకంగా పరీక్షను తిరస్కరించడం హాట్ టాపిక్ అయింది. కుల్సుమ్ బానో అని విద్యార్థిని మాట్లాడుతూ బియావర్ నుండి నీట్ పరీక్ష రాయడానికి అజ్మీర్ వచ్చానని తాను మే 3న బుర్ఖా, దుప్పట్టాతోనే వచ్చి రాశానని ఇప్పుడు అవి తీసేయాలని అంటున్నారని చెప్పారు. ఇలా రాసేందుకు NTA అనుమతి ఇచ్చింది. కానీ వీళ్లు పర్మిషన్ ఇవ్వట్లేదని నాకు పరీక్ష కంటే బురఖా, నా గుర్తింపే ముఖ్యం అని పేర్కొంది. 18 ఏళ్ల విద్యార్థుల జీవితాలతో ఇలా ఆడుకోవడం సిగ్గుచేటు అని పేర్కొంది. అయితే బుర్ఖా కోసం తన పరీక్షను వదులుకోవడం చర్చనీయాశంగా మారింది.






