- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ జెండాకు ఘోర అవమానం !
మండల కేంద్రంలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది.

దిశ, గంగాధర : మండల కేంద్రంలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. దేశం గర్వంగా చెప్పుకునే మువ్వన్నెల జెండాలు మండల కేంద్రంలోని ఒక మర్రిచెట్టు కింద, చెత్తాచెదారం వేసే ప్రాంతంలో అనాథగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. జాతీయ పతాకాలను గౌరవించాల్సిన చోట, ఇలా చెత్తకుప్పలో పారేయడం పై స్థానికంగా తీవ్ర ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రంలోని మర్రిచెట్టు కింద ఉన్న చెత్తకుప్పలో జాతీయ జెండాలు పడి ఉండటాన్ని అటుగా వెళ్తున్న మొగిలి మహేష్ అనే వ్యక్తి గమనించారు. మువ్వన్నెల పతాకాలు అలా చెత్తలో అగౌరవంగా పడి ఉండటం చూసి చలించిపోయిన ఆయన.. వెంటనే వాటిని భద్రంగా బయటకు తీశారు. అనంతరం ఈ విషయాన్ని గంగాధర గ్రామ పంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి, ఆ జెండాలను వారికి పదిలంగా అప్పగించారు. దేశభక్తితో స్పందించి జాతీయ జెండాల గౌరవాన్ని కాపాడిన మొగిలి మహేష్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.
జెండాలు పడి ఉన్న ప్రాంతానికి కూతవేటు దూరంలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ రూట్ నుంచే ప్రయాణిస్తుంటారు. అయినా, చెత్తలో పడి ఉన్న జాతీయ జెండాలను అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ జెండాలను ఇక్కడ ఎవరు పడవేశారు ? ప్రభుత్వ కార్యాలయాల్లో వాడిన జెండాలను ఇలా నిర్లక్ష్యంగా పారేశారా ? లేక మరెవరైనా కావాలనే ఈ పని చేశారా ? అంటూ గ్రామస్థులు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ఈ ఘోరానికి ఎవరిని బాధ్యులను చేయాలని స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విచారణ జరిపి జాతీయ జెండాను అవమానించిన బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని గంగాధర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






