ఆచార్య జయశంకర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి : ఎమ్మెల్యే

by Taduka Kalyani |

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, ఉద్యమానికి సిద్ధాంతకర్త, ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే గొల్లపల్లి శంకర్ అన్నారు.

ఆచార్య జయశంకర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి : ఎమ్మెల్యే
X

దిశ, షాద్ నగర్: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, ఉద్యమానికి సిద్ధాంతకర్త, ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే గొల్లపల్లి శంకర్ అన్నారు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాలు, పొలిటికల్ జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో కలిసి ఆదివారం స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదవులు, ప్రలోభాలు, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తన జీవిత లక్ష్యంగా మలుచుకున్న మహోన్నత వ్యక్తిత్వం ఆచార్య జయశంకర్ ది అని అన్నారు. జయశంకర్ ఆలోచనలు, త్యాగం, నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి,,పొలిటికల్ జేఏసీ నాయకులు టీజీ. శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ రవికుమార్, అర్జునప్ప, రామారావు, రవీంద్రనాథ్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో

ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని వీర ఆధ్వర్యంలో పట్టణంలోని న్యూ సిటీ కాలనీలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను సాధించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవి యాదవ్ అన్నారు. పట్టణంలోని న్యూ సిటీ కాలనీలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయశంకర్ చూపిన బాటలో తెలంగాణ స్వయం సమృద్ధి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వీట గణేష్, మన్నే నారాయణ, దేవేందర్ యాదవ్, నటరాజన్, కౌన్సిలర్లు వసంత, శారద, గౌస్ జానీ తదితరులు పాల్గొన్నారు.

Next Story