- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉదయం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు !
by Batti.Sumithra |
ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉంది. అయితే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం హఠాత్తుగా చల్లబడింది.

X
దిశ, గంగాధర : మండలంలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉంది. అయితే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం హఠాత్తుగా చల్లబడింది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకొని మండల కేంద్రమైనతో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి ఈ ఆకస్మిక వర్షంతో ఒక్కసారిగా ఉపశమనం లభించింది. వాతావరణం పూర్తిగా చల్లబడటంతో జనం సేదతీరారు. సకాలంలో వర్షాలు కురవాలని, కరువు కాటకాలు పోవాలని మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు, మొక్కులు మొక్కుతున్న తరుణంలోనే.. ఇలా హఠాత్తుగా వరుణ దేవుడు కరుణించి వర్షం కురిపించడం పై స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






