జయశంకర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలి: టీపీసీసీ జనరల్​ సెక్రటరీ

by Kodari Anjali |

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప మహనీయుడు జయశంకర్ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.

జయశంకర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలి: టీపీసీసీ జనరల్​ సెక్రటరీ
X

దిశ, వనస్థలిపురం: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా కొనియాడారు. ఆదివారం ఆయన వర్ధంతి సందర్భంగా ఎల్‌బీనగర్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి బలమైన సిద్ధాంతపరమైన పునాదులు వేసిన గొప్ప మేధావిగా ఆయనను అభివర్ణించారు. జయశంకర్ ఆశయాలు, విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story