' పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి '

by Batti.Sumithra |

పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ అన్నారు.

 పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి
X

దిశ, హన్వాడ : పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం హన్వాడ మండలంలోని వెంకటమ్మ కుంట తాండాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రూ.10 లక్షల వ్యయంతో MGNREGS నిధుల ద్వారా నిర్మించనున్న స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని లాల్య నాయక్ తాండాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణంతో స్థానికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాలను మెరుగుపర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆమె అన్నారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు తరగతి గదులు కావాలని నాయకులు వారికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, ఎంపీ హామీ ఇచ్చారు. తాము విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మండల అధ్యక్షులు వి. మహేందర్ నాయకులు చెన్నయ్య, సుధాకర్ రెడ్డి, సర్పంచ్ లు ప్రతాప్ నాయక్, విజయ వెంకట్, ఉపసర్పంచ్ లక్ష్మణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Next Story