సవాల్ కు సిద్ధం.. రండి తేల్చుకుందాం : పైడాకుల అశోక్

by Batti.Sumithra |

మంత్రి సీతక్క పై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలే తరిమి కొడతారని, అవినీతి పై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ నాయకులు చేసిన సవాల్ ను స్వీకరిస్తూ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు.

సవాల్ కు సిద్ధం.. రండి తేల్చుకుందాం : పైడాకుల అశోక్
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : మంత్రి సీతక్క పై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలే తరిమి కొడతారని, అవినీతి పై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ నాయకులు చేసిన సవాల్ ను స్వీకరిస్తూ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న తరుణంలో జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్న సమయంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దండుకొని అహంకారంతో మాట్లాడుతున్నారని, రాజకీయ అవినీతి పరులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు.

ములుగు జిల్లాలో అన్ని అమతులతోనే ఇసుక రవాణా జరుగుతున్నదని, గిరిజనుల అభివృద్ధియే లక్ష్యంగా ఇసుక సొసైటీలకు అనుమతులు ఇవ్వగా వారి ద్వారానే ఇసుక రవాణా జరుగుతున్నదని తెలిపారు. గుంటూరు జిల్లా నుండీ వచ్చిన తెలివి లేని బీఆర్ఎస్ నాయకుడు సతీష్ రెడ్డి పసలేని ఆరోపం చేస్తున్నారని, ఆయనకు దమ్ముంటే రా మేడారం సమ్మక్క సారలమ్మ, మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, భద్రాద్రి రామాలయం ఎక్కడికి వస్తావోరా చర్చిద్దామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సతీష్ రెడ్డికి ములుగుతో సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. సతీష్ రెడ్డి మంత్రి సీతక్క ఆరోపణలు చేయడం మానుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సతీష్ రెడ్డికి నిజంగా దమ్ముంటే సోమవారం ఉదయం 11 గంటలకు మేడారం నుంచి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story