పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ టీం దాడులు.. 650 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

by Kodari Anjali |

ఎక్సైజ్ శాఖ టీం బెల్లం పానకం ధ్వంసం చేసుకున్నారు.

పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ టీం దాడులు.. 650 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
X

దిశ, తుంగతుర్తి: ఎక్సైజ్, ప్రొహిబిషన్ రాష్ట్రానికి చెందిన స్పెషల్ టీం ఫోర్స్‌తో పాటు సూర్యాపేట, తుంగతుర్తి టీంల బృందాలు సంయుక్తంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం దాడులు జరిపాయి. ఈ మేరకు 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా 650 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి నలుగురిపై కేసులు నమోదు చేశారు. జజిరెడ్డిగూడెం, తుంగతుర్తి మండలాలలోని రాజన్న తాండ, అన్నారం, మేడిబాయి తాండ, మర్రిబాయి తాండ, కొమ్మాల గ్రామాలలో ఈ దాడులు జరిగాయి. దాడులలో తుంగతుర్తి, సూర్యాపేట ఎస్సైలు మూర్తి, స్వర్ణలత, ఎస్టిఎఫ్ ఎస్ఐ శోభారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story