- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టి-ఫైబర్‌కు ప్రతిష్టాత్మక 'స్కోచ్' అవార్డు
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సమానత్వాన్ని సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు గుర్తింపు లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సమానత్వాన్ని సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం, ఈ-గవర్నెన్స్ సేవలకు బలమైన మౌలిక వసతులు కల్పించడంలో విశేష కృషి చేసిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ (టి-ఫైబర్) ప్రతిష్టాత్మక 'స్కోచ్ అవార్డు-2026'ను కైవసం చేసుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును టి-ఫైబర్ బృందం అందుకుంది. అవార్డును అందుకున్న అనంతరం టి-ఫైబర్ బృందం సభ్యులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టి-ఫైబర్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి అవార్డును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా వారు చేపట్టిన కార్యక్రమాలను మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య, ఏఐ ఆధారిత అభ్యాసం, రైతు వేదికలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించడం వంటి అంశాల్లో టి-ఫైబర్ పోషిస్తున్న పాత్రను వివరించారు.
ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలు
టి-ఫైబర్ సాధించిన ఈ అవార్డు పట్ల మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ పరివర్తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి కుటుంబానికి అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, గృహాలకు టి-ఫైబర్ సేవలను మరింత వేగంగా విస్తరించాలని అధికారులను ఆదేశించారు.






