వానదేవుడా కరుణించు.. 'కందుగుల'లో గ్రామదేవతలకు జలాభిషేకం!

by Batti.Sumithra |

మృగశిర కార్తె ప్రవేశించి, వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వానలు కురవడం లేదు.

వానదేవుడా కరుణించు.. కందుగులలో గ్రామదేవతలకు జలాభిషేకం!
X

దిశ, హుజురాబాద్ రూరల్ : మృగశిర కార్తె ప్రవేశించి, వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వానలు కురవడం లేదు. దీంతో అటు అన్నదాతల్లో ఆందోళన మొదలవగా.. ఇటు వర్షాల కోసం వానదేవుడి కరుణకై కందుగుల గ్రామ మహిళలు వినూత్న పూజలు నిర్వహించారు. హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో సకాలంలో వర్షాలు పడాలని కోరుకుంటూ గ్రామ దేవతలకు వందలాది బిందెలతో జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇళ్లకు ఇళ్లే కదిలి..

​ఆదివారం కందుగుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ పరిధిలోని ప్రతి ఇంటా మహిళలు కదిలారు. ఉదయాన్నే తలల పై నీటి బిందెలతో ఊరేగింపుగా దేవాలయాల వైపు తరలివచ్చారు.

​భక్తిశ్రద్ధలతో జలాభిషేకం..

​గ్రామంలోని భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి దేవతలకు వందలాది బిందెల నీళ్లతో భక్తిశ్రద్ధలతో జలాభిషేకం చేశారు. కరవు కాటకాలు రాకుండా, గ్రామం సుభిక్షంగా ఉండాలని, వానదేవుడు శాంతించి త్వరగా వర్షాలు కురిపించాలని దేవతలకు ప్రత్యేక పూజలు చేసి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని, తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. గ్రామంలో వర్షాల కోసం చేసిన ఈ జలాభిషేకం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

Next Story