- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. ఉదయం అన్న, మధ్యాహ్నం చెల్లెలు మృతి
by Naga Rani Yarlagadda |
అనారోగ్యంతో అన్నాచెల్లెలు ఒకేరోజు మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుతుర్లలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యంతో అన్నాచెల్లెలు ఒకేరోజు మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుతుర్లలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం అన్న జీవన్ రాజు తీవ్ర జ్వరంతో కన్నుమూయడంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మధ్యాహ్నానికి చెల్లెలు మేరీ కూడా జ్వరంతోనే చనిపోవడం ఆ తల్లిదండ్రులకు కడుపుశోకాన్ని మిగిల్చింది. చిన్నారులిద్దరూ జ్వరంతో తీవ్రంగా బాధపడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. కాగా.. అదే గ్రామంలో మరో ఇద్దరు చిన్నారులు అనారోగ్యానికి గురవ్వగా.. ఇద్దరినీ పెదబయలు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పిల్లలిద్దరికీ చికిత్స అందిస్తున్నారు. జ్వరంతో ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మరణించడంతో.. విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వైద్యుల నుంచి స్పష్టత రావలసి ఉంది.
Next Story






