- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యోగా దివ్యౌషధం.. ప్రతిరోజూ చేయండి: ఎస్పీ పరితోష్ పంకజ్
by Taduka Kalyani |
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో యోగా కార్యక్రమాలను నిర్వహించారు.

X
దిశ,సంగారెడ్డి అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో యోగా కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ జిల్లా ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 21వ తేదీ ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజుగా గుర్తింపు పొందినందున ఈ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఒత్తిడిని దూరం చేసి భావోద్వేగాలను నియంత్రిస్తూ శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చే దివ్యౌషధం యోగా అని అన్నారు. ప్రతిరోజూ యోగాభ్యాసం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, స్థితప్రజ్ఞత పెంపొందుతాయని తెలిపారు.యోగం అనేది కేవలం శరీర ఆరోగ్యానికే పరిమితం కాకుండా మనస్సుపై కూడా నియంత్రణ సాధించే శాస్త్రీయ విధానమని ఎస్పీ వివరించారు. స్వామి వివేకానంద చెప్పినట్లు దృఢ సంకల్పంతో కూడిన కార్యాచరణ, చురుకైన జీవన విధానం, ఆశావహ దృక్పథం ఇవన్నీ మన అంతరంగ శక్తిని పెంపొందించే సాధనాలు అని గుర్తు చేశారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, ప్రతిరోజూ కొంత సమయాన్ని యోగాభ్యాసానికి కేటాయించాలని సూచించారు. ఒత్తిడి తగ్గించడంలో, ఏకాగ్రత పెంపొందించడంలో, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పోలీసు విధులు ఒత్తిడితో కూడుకున్నవని, యోగాభ్యాసం ద్వారా విధి నిర్వహణలో మరింత చురుకుదనం, మానసిక ప్రశాంత సాధించవచ్చని ఎస్పీ పోలీసు సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా యోగా గురువులు ఆదిత్య, శివకుమార్ జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి యోగా ఆసనాలు, ధ్యానం, శ్వాసపై ధ్యాస, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం తదితర యోగాభ్యాసాలను చేయించారు. వారి సేవలను జిల్లా ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఆర్‌ఐలు అశోక్, రాజశేఖర్ రెడ్డి, డానియోల్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






