- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పచ్చని చెట్లపై గొడ్డలి వేటు!
ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు వన మహోత్సవం పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతుంటే, మరోవైపు ప్రభుత్వ అధికారులే వాటిని నిర్ణయాత్మకంగా నరికేస్తున్నారు.

దిశ,రాజంపేట్: ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు వన మహోత్సవం పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతుంటే, మరోవైపు ప్రభుత్వ అధికారులే వాటిని నిర్ణయాత్మకంగా నరికేస్తున్నారు. రాజంపేట మండలం ఆరుగొండ, బస్వాన్నపల్లి గ్రామాల మధ్య ఉన్న రహదారి పక్కన తాజాగా చోటుచేసుకున్న ఘటనే అందుకు నిదర్శనం. రహదారుల ఇరుపక్కలా మొక్కలు నాటడం, వాటిని కాపాడడం కోసం ప్రభుత్వం ఏటా ఉపాధి హామీ, ఇతర విభాగాల ద్వారా లక్షలాది రూపాయల నిధులు ఖర్చు చేస్తోంది.
ఎంతో శ్రమించి, నిధులు వెచ్చించి పెద్దగా చేసిన ఆ చెట్లు.. నేడు విద్యుత్ అధికారులు తమ నిర్లక్ష్యంతో నిలువునా నరికేస్తున్నారు. విద్యుత్ లైన్ల కింద చెట్లు ఉన్నాయనే సాకుతో, కేవలం కొమ్మలను కత్తిరించాల్సింది పోయి, ఏకంగా గొడ్డళ్లతో చెట్ల మొదళ్లకే వేటు వేస్తూ పచ్చదనాన్ని తుంచేస్తున్నారు. ఒక శాఖ ఎంతో నిధులు వెచ్చించి చెట్లను పెంచితే, మరో శాఖ ఇలా దారుణంగా నరికి ప్రజాధనాన్ని బూడిద పాలు చేయడం పై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ లైన్ల నిర్వహణ ముఖ్యం అయినప్పటికీ, చెట్లను పూర్తిగా నరికేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, ఈ నిర్వాకానికి కారణమైన వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






