కులాన్ని తక్కువగా చూడొద్దు: వంగా గీత రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-21 08:09:09  IST  )

ఏపీ రాజకీయాల్లో ఇటీవల కుల ప్రస్తావన వినిపిస్తోంది. ముఖ్యంగా కూటమిలో జనసేన పార్టీ ఉండటం, పవన్ కల్యాణ్ కాపు వ్యక్తి కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను టార్గెట్ చేసింది..

కులాన్ని తక్కువగా చూడొద్దు: వంగా గీత రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap) రాజకీయాల్లో ఇటీవల కుల ప్రస్తావన వినిపిస్తోంది. ముఖ్యంగా కూటమిలో జనసేన పార్టీ(Jansena Party) ఉండటం, పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాపు వ్యక్తి కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) ఆయన్ను టార్గెట్ చేసింది. దీంతో తనకు కులాన్ని ఆపాదించొద్దని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. తాను ప్రాంతాలకు కూడా అతీతమని బహిరంగ సభల్లోనూ స్పష్టం చేశారు. అయినా సరే వైసీపీ మాజీ నేతలు అమర్‌నాధ్(Amarnath), అంబటి రాంబాబు(Ambati Rambabu), వంగా గీత(Vanga Geetha) లాంటి వ్యక్తులు పవన్ కల్యాణే టార్గెట్‌గా కుల విమర్శలు చేస్తున్నారు.

కుల ప్రస్తావన చేసిందే పవన్ కల్యాణ్

తాజాగా సైతం కాపు ప్రస్తావన వచ్చేలా మాట్లాడారు. రాజకీయాల్లో చాలాసార్లు కుల ప్రస్తావన చేసిందే పవన్ కల్యాణ్ అని మాజీ మంత్రి అమర్ నాథ్ అన్నారు. భీమవరం, గాజువాక ఎన్నికల సమయంలోనూ కులం అంశాలను పవన్ ప్రస్తావించారని గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారని గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.

మరో నేత అంబటి రాంబాబు సైతం పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ తోలు తీస్తామంటే తీయమనండి చూద్దామని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

కులం పుట్టుకతో వస్తుంది...

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్‌తో బరిలోకి దిగి ఓడిపోయిన వంగా గీత సైతం విమర్శలు కురిపించార. కులం పుట్టుకతో వస్తుందని, తక్కువగా చూడొద్దని సూచించారు. అధికారంలోకి ఉన్నా లేకపోయినా పవన్ కల్యాణ్ ఒకేలా ఉంటామంటే ఎలా అని వంగా గీత ప్రశ్నించారు. పిఠాపురంలో అన్ని కులాల వారు ఓట్లు వేస్తేనే ఆయన గెలిచారని, ఒక పవన్ కల్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని వంగా గీత సూచించారు.

Next Story