స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. యువతి దుర్మరణం

by Jakkula.Mamatha |

రోజంతా పనిచేసి ఇంటికి బయలుదేరిన యువతి.. మరికొద్ది నిమిషాల్లో గమ్యం చేరాల్సి ఉండగా ఆర్టీసీ బస్సు రూపంలో ఆమెను మృత్యువు కబళించింది.

స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. యువతి దుర్మరణం
X

దిశ, వనస్థలిపురం: రోజంతా పనిచేసి ఇంటికి బయలుదేరిన యువతి.. మరికొద్ది నిమిషాల్లో గమ్యం చేరాల్సి ఉండగా ఆర్టీసీ బస్సు రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఓ బ్యుటీషియన్​ ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రత్యూష(20) పెద్ద​ అంబర్​పేటలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంది. నగరంలో బ్యూటీషియన్​గా పనిచేస్తున్న ఆమె.. శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. హయత్​నగర్​ పుల్లారెడ్డి స్వీట్స్​ సమీపంలోకి రాగానే.. ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన ప్రత్యూషకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయింది. కాగా ప్రత్యూష స్వస్థలం నాగర్‌ కర్నూల్ జిల్లా పదర మండలం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ సిహెచ్​ శంకరయ్య తెలిపారు.

Next Story