- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుస్తుల కాంట్రాక్టులు ‘టెస్కో’కే ఇవ్వండి.. PMU నోటిఫికేషన్‌ను రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ అవసరాలకు బట్టలను టెస్కో ద్వారానే సేకరించాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కారుకు హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. ప్రభుత్వ సంస్థలకు అవసరమైన దుస్తులు, బెడ్ షీట్లను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సేకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అన్ని ప్రభుత్వ అవసరాలకు ఖచ్చితంగా టెస్కో (TESCO) ద్వారానే చేనేత వస్త్రాలను సేకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు అవసరమైన దుస్తులు (Cloths), బెడ్ షీట్ల (Bedsheets)ను ప్రైవేట్ సంస్థల ద్వారా సేకరించేందుకు ఈ నెల 2న ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU) ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల చేనేత కార్మికుల పొట్ట కొట్టినట్లవుతుందని వరంగల్ జిల్లాకు చెందిన వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్స్ సహా పలు సొసైటీలు హైకోర్టును ఆశ్రయించాయి.
ధర్మాసనం కీలక వ్యాఖ్యలు..
అయితే, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చేనేత పరిశ్రమపై రాష్ట్రంలో దాదాపు 40 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని కోర్టు పేర్కొంది. చేనేత పరిశ్రమను ఆదుకునేందుకే గతంలో అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులు వారికే దక్కేలా జీవోలు తెచ్చారని, వాటిని అతిక్రమించడం సరికాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పీఎంయూ (PMU) విడుదల చేసిన నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.
కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట.. పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు






