- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైజాగ్ చేరిన మెరైన్ ఇంజనీర్ మృతదేహం
ఒమన్ సముద్ర తీరంలో జరిగిన ఘోర నౌక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతదేహం ఎట్టకేలకు ఇంటికి చేరింది.

దిశ, వెబ్ డెస్క్ : ఒమన్ సముద్ర తీరంలో జరిగిన ఘోర నౌక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతదేహం ఎట్టకేలకు ఇంటికి చేరింది. గత వారం సముద్ర తీరంలో నౌకపై జరిగిన దాడి ఘటనలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. సురేష్ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం విశాఖపట్నం నగరంలోని శ్రీనివాసనగర్‌లో గల ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, సురేష్ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. సురేష్ మృతి అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సురేష్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కష్ట సమయంలో సురేష్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా, అలాగే సదరు షిప్పింగ్ ఏజెన్సీల నుంచి అందవలసిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు, పరిహారం సకాలంలో అందేలా తన వంతు పూర్తి కృషి చేస్తానని ఎమ్మెల్యే గణబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కాగా, చేతికి అందివచ్చిన కొడుకు మరణ వార్తతో సురేష్ కుటుంబసభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.






