- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు
హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ విమానాశ్రయం ప్రతిష్టాత్మక 'ఏసీఐ యాక్సెస్‌బిలిటీ ఎన్‌హాన్స్‌మెంట్ అక్రెడిటేషన్ లెవల్-2'ను సాధించిందని ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయంలో అందుతున్న అత్యాధునిక సౌకర్యాలకు ఈ అక్రెడిటేషన్ దక్కింది.
విమానాశ్రయానికి వచ్చే వీల్‌ఛైర్ వినియోగదారులు, కంటి చూపు సమస్యలు ఉన్నవారు, వినికిడి లోపం, తాత్కాలిక గాయాలు మరియు మానసిక వైకల్యంతో బాధపడుతున్న ప్రత్యేక అవసరాలు గల ప్రయాణికులకు ఆర్జీఐఏలో అత్యుత్తమ సేవలు అందుతున్నాయి. వీరికి ఎయిర్‌పోర్ట్ లోపల చెక్-ఇన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బోర్డింగ్ గేట్ వరకు, అలాగే విమానం ఎక్కడం, దిగడంలో సిబ్బంది అందిస్తున్న నాణ్యమైన, సురక్షితమైన సేవలను గుర్తించి ఈ అంతర్జాతీయ బహుమతిని ఖరారు చేశారు. ఈ ఘనతపై ఎయిర్పోర్టు అధికారులు స్పందిస్తూ.. ఇక్కడికి వచ్చే ప్రతి ప్రయాణికునికి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా వినూత్న సేవలను అందించడంపై తాము ఎల్లప్పుడూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






