- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక భక్తి కాదు.. రిలిజియస్ OCD కావచ్చు!
రమ్య అనే అమ్మాయి ప్రతిరోజూ పూజ చేసేది. ఒకరోజు పూజ చేస్తున్నప్పుడు ఏదో ఒక విషయం గురించి ఒక చెడు ఆలోచన ఆమె మనసులోకి వచ్చిన వెంటనే ఆమె భయపడింది.

రమ్య అనే అమ్మాయి ప్రతిరోజూ పూజ చేసేది. ఒకరోజు పూజ చేస్తున్నప్పుడు ఏదో ఒక విషయం గురించి ఒక చెడు ఆలోచన ఆమె మనసులోకి వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆమె భయపడింది. “ఇది పాపం అయిపోయిందా?”, “దేవుడు నన్ను క్షమిస్తాడా?”, అని ఆలోచిస్తూ మళ్లీ పూజ చేసింది. అయినా భయం తగ్గలేదు. తరువాత రోజూ అదే సమస్య మొదలైంది. ఆమె గంటల కొద్దీ ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చదువుపై, కుటుంబంపై దృష్టి తగ్గిపోయింది. ఇది సాధారణ భక్తి కాదు. దీన్నీ Religious OCD అంటారు. ఇది OCD అనే మానసిక సమస్యలో ఒక రకం. ఇందులో వ్యక్తికి మతం, దేవుడు, పాపం, ప్రార్థనలు, శుభ్రత, ఆచారాలు వంటి విషయాల గురించి ఎక్కువగా భయం మరియు అనవసర ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు నిజంగా కావాలని రావు. కానీ అవి మళ్లీ మళ్లీ మనసులోకి వచ్చి వ్యక్తిని చాలా టెన్షన్‌కు గురిచేస్తాయి.
రిలిజియస్ OCD అంటే ఏమిటి?
రెలిజియస్ OCD (Religious Obsessive Compulsive Disorder) అనేది OCD అనే మానసిక సమస్యలో ఒక రకం. దీనిని కొంతమంది “స్క్రుపులోసిటీ” (Scrupulosity) అని కూడా అంటారు. ఇందులో వ్యక్తికి మతం, దేవుడు, పాపం, ప్రార్థనలు, శుభ్రత, ఆచారాలు వంటి విషయాల గురించి ఎక్కువగా భయం మరియు అనవసర ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు నిజంగా కావాలని రావు. కానీ అవి మళ్లీ మళ్లీ మనసులోకి వచ్చి వ్యక్తిని చాలా టెన్షన్‌కు గురిచేస్తాయి. ఉదాహరణకు: “నేను దేవుడిని అవమానించానేమో?”, “ప్రార్థన సరిగా చేయలేదేమో?”, “నా మనసులో వచ్చిన చెడు ఆలోచన పాపమా?”, “దేవుడు నన్ను శిక్షిస్తాడా?”... ఇలాంటి ప్రశ్నలు నిరంతరం వేధిస్తుంటాయి. సాధారణ భక్తి మరియు రిలిజియస్ OCD మధ్య పెద్ద తేడా ఉంది. భక్తి మనసుకు ప్రశాంతత ఇస్తుంది. కానీ OCD భయం, ఆందోళన, గిల్టీ (పాపభావన) పెంచుతుంది.
ఓసీడీలో “Obsessions”, “Compulsions”
Obsessions (మళ్లీ మళ్లీ వచ్చే ఆలోచనలు). ఇవి మనసులోకి బలవంతంగా వచ్చే భయపెట్టే ఆలోచనలు. ఉదాహరణలు: దేవుడి గురించి చెడు మాటలు మనసులో రావడం, పూజలో తప్పు జరిగిందని భయం, పాపం చేశానని అనుమానం. నరకానికి వెళ్తానేమో అని భయం. Compulsions (తప్పనిసరిగా చేసే పనులు): భయాన్ని తగ్గించుకోవడానికి వ్యక్తి కొన్ని పనులు మళ్లీ మళ్లీ చేస్తాడు. ఉదాహరణలు: ఒకే ప్రార్థనను పదిసార్లు చెప్పడం, చేతులు ఎక్కువసార్లు కడుక్కోవడం, దేవుడి ముందు పదేపదే క్షమాపణ చెప్పడం, మంత్రాలను సరిగ్గా పలికారో లేదో తిరిగి చెక్ చేయడం. కొంతసేపు రిలీఫ్ వచ్చినా, తరువాత మళ్లీ అదే భయం మొదలవుతుంది. ఈ సమస్య ప్రతి వ్యక్తిలో వేర్వేరుగా కనిపించవచ్చు.
కొన్ని సాధారణ లక్షణాలు
దేవుడిని అవమానించే ఆలోచనలు రావడం, ప్రతి చిన్న విషయాన్నీ పాపంగా భావించడం, ప్రార్థనలు పూర్తిగా సరిగ్గా చేయాలనే ఒత్తిడి పవిత్రత గురించి అధిక భయం, “నేను మంచి భక్తుడిని కాదేమో” అనే అనుమానం, మతపరమైన నియమాలు తప్పకుండా ఫాలో అవ్వాలనే ఆందోళన, దేవుడు కోపపడతాడనే భయం. ఎందుకు వస్తుంది? రిలిజియస్ OCD రావడానికి ఒక్క కారణం ఉండదు. అనేక కారణాలు కలిసి ప్రభావం చూపవచ్చు. మెదడులో కెమికల్ మార్పులు, అధిక ఆందోళన స్వభావం. పర్ఫెక్షన్ భావన, చిన్నప్పటి కఠిన మతపరమైన భయాలు, స్ట్రెస్ మరియు ఒత్తిడి, కుటుంబ చరిత్ర. ఇది వ్యక్తి బలహీనత కాదు. ఇది ఒక మానసిక ఆరోగ్య సమస్య.
ఇది నిజమైన భక్తి కాదా?
చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. “నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టే ఇలా చేస్తున్నాను” అని అనుకోవచ్చు. కానీ రిలిజియస్ OCDలో ప్రేమ కంటే భయం ఎక్కువగా ఉంటుంది. సాధారణ భక్తి: మనశ్శాంతి ఇస్తుంది, ఆనందం కలిగిస్తుంది, జీవితాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. Religious OCD భయం పెంచుతుంది, గిల్టీ పెంచుతుంది, సమయం వృథా చేస్తుంది, రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సమస్య ఎక్కువైతే: చదువు లేదా ఉద్యోగంపై ప్రభావం పడుతుంది, కుటుంబ సభ్యులతో దూరం పెరుగుతుంది, నిద్ర తగ్గుతుంది, ఆందోళన మరియు డిప్రెషన్ రావచ్చు, వ్యక్తి ఒంటరిగా మారవచ్చు. రిలిజియస్ OCD ఉన్న చాలా మంది మొదట తమ సమస్యను “భక్తి ఎక్కువ కావడం”గా భావిస్తారు. కానీ ఇది క్రమంగా భయం, ఆందోళన, గిల్టీ, మానసిక ఒత్తిడిగా మారుతుంది. అలాంటి సమయంలో సైకాలజిస్టును సంప్రదించడం చాలా అవసరం.
అనూరాధ నాయుడు ఎం,
మనోవికాస నిపుణులు
83175 88344






