- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావంపై కేబినెట్లో సుదీర్ఘ చర్చ
ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కొన్ని కీలక అంశాలపై 3 గంటలపాటు చర్చించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కొన్ని కీలక అంశాలపై 3 గంటలపాటు చర్చించింది. అజెండా అంశాలపై చర్చించిన అనంతరం.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని లోటు వర్షపాత పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంక్షోభాన్ని అన్ని శాఖల వారు సవాల్ గా తీసుకుని ఎదుర్కోవాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తాగునీటికి తొలి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. పశువుల మేతకు (పశుగ్రాసం) తర్వాతి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రజలకు వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో పరిస్థితులను మంత్రులే వివరించాలని ఆదేశించారు. రైతులకు ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని తెలిపారు. సమస్య ఎక్కడ వచ్చినా.. ఇంఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు. ఇక భోగాపురంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన వివరాలను అధికారులు సీఎం చంద్రబాబు, మంత్రులకు వివరించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఒకరోజు ముందే ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో పింఛన్లు పంపిణీ చేసి.. ఆయన పర్యటన కార్యక్రమంలో నిమగ్నమవ్వాల్సిందిగా సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.






