- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీకి సంఘీభావంగా ముల్కనూరులో కాంగ్రెస్ నిరసన
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సంఘీభావంగా, కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ముల్కనూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, భీమదేవరపల్లి : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సంఘీభావంగా, కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ముల్కనూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.-
ఈ సందర్భంగా పోచంపల్లి రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలు సరికావని అన్నారు. ప్రతిపక్షాల గొంతును అణిచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు జాలి ప్రమోద్ రెడ్డి, కేతిరి లక్ష్మారెడ్డి, వెంకన్న, గోపగాని తిరుపతి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కుల అనిల్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిదురాల స్వరూప, ఎల్కతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి, సట్ల శ్రీలత, లలిత, మంగ రామచంద్రం, ఉసకోయిల ప్రకాష్, కొలుగూరి రాజు, ఆదరి రవీందర్, చంద్రశేఖర్ గుప్తా, చిట్కూరి అనిల్, పోగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






