విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

by Ratna Kumari |

నీట్ పరీక్ష పత్రాల లీకేజీ ఘటనపై విద్యార్థులు దేశవ్యాప్తంగా చేస్తున్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చారకొండ పీఏసీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్ డిమాండ్ చేశారు.

విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
X

దిశ, చారకొండ : నీట్ పరీక్ష పత్రాల లీకేజీ ఘటనపై విద్యార్థులు దేశవ్యాప్తంగా చేస్తున్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చారకొండ పీఏసీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా విద్యార్థులు చేపడుతున్న నిరసనలు, ఆమరణ దీక్షలు, వాటిని భగ్నం చేయడం, నిరసనకారులు, విద్యార్థులు, వారికి మద్దతు తెలిపిన పౌరులపై లాఠీచార్జీ చేయడం అత్యంత అమానవీయ చర్య అని విమర్శించారు.

దేశవ్యాప్తంగా యువత రాజకీయాలకు అతీతంగా నిరసనలు వ్యక్తం చేస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, మేధావులు వారికి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన వైఫల్యానికి బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి, అధికార పార్టీ నాయకులు నిరసనకారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. జాతీయ స్థాయి పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, లేదంటే అన్యాయానికి గురైన విద్యార్థుల డిమాండ్లపై చర్చలు జరిపి తగిన పరిష్కారం చూపాలని జెల్ల గురువయ్య గౌడ్ డిమాండ్ చేశారు.

Next Story