రాష్ట్రపతి ఎన్నికల మేనేజ్మెంట్ టీమ్‌లో డీకే అరుణకు స్థానం..

by Vinod kumar |
రాష్ట్రపతి ఎన్నికల మేనేజ్మెంట్ టీమ్‌లో డీకే అరుణకు స్థానం..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్రపతి ఎన్నికల మేనేజ్ మెంట్ టీమ్‌లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి డీకే అరుణకు స్థానం లభించింది. భారతీయ జనతా పార్టీ బలపరిచే రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించేందుకు ఆ పార్టీ 14 మంది బృందంతో కూడిన కమిటీని శుక్రవారం ప్రకటించింది. ఈ కమిటీలు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలకు స్థానం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం నుండి డీకే అరుణకు ఈ కమిటీలో స్థానం కల్పించడంతో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed