నన్ను నా కొడుకు అలా కొడుతున్నాడు.. జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన!

by Jakkula Samataha |
నన్ను నా కొడుకు అలా కొడుతున్నాడు.. జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన!
X

దిశ, సినిమా : జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి, కొరటాల శివ ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. తన కొడుకు తనను కొడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అసలు విషయంలోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్, ప్రణతీలకు ఇద్దరు కొడుకులు. ఒకరు అభయ్ రామ్, భార్గవ్ రామ్. అయితే వీరి గురించి తారక్ చెప్తూ తన కొడుకు అభయ్ రామ్ చాలా సౌమ్యుడు తనలాగే, అలాగే తన కొంటె పనులు కూడా ఆయనకే వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి కొరటాల శివ, రాజమౌళి గెస్ట్ గా హాజరు అయ్యారు.

అయితే వారితో తన ఇద్దరు కొడుకుల గురించి జూనియర్ ఎన్టీఆర్ ఓపెన్ అయ్యారు. దర్శకులతో మాట్లాడుతూ.. అభయ్ చాలా కొంటె పనులు చేస్తున్నాడు. నాలాగే సౌమ్యుడు, నాలానే కొంటె పనులు చేస్తున్నాడు. ఒక రోజు నేను మంచి నిద్రలో ఉన్నాను. వాళ్లు సడెన్‌గా వచ్చి పడేల్ మని కొట్టిపోయారు. ఇద్దరిలో ఎవరా అని ఎంక్వైరీ చేయగా అభయ్ గాడని తెలిసిందని చెప్పారు. అభయ్ రామే ఇది చేస్తాడని కొరటాల అన్నారు, అవును అభయే అంటూ తారక్ చెప్పారు. అభయ్ చాలా సౌమ్యుడు, ఇలాంటి పనులు కూడా చేస్తాడు. ఇక భార్గవ్ ప్రణతిలా కాస్త హైపర్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.Next Story

Most Viewed