ఖలిస్థానీ వేర్పాటువాది పన్నూ హత్య కుట్ర కేసు.. అమెరికా కోర్టుకు నిఖిల్

by Shamantha N |
ఖలిస్థానీ వేర్పాటువాది పన్నూ హత్య కుట్ర కేసు.. అమెరికా కోర్టుకు నిఖిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో భారత్ కు చెందిన నిఖిల్ గుప్తా అరెస్టయి చెక్ రిపబ్లిక్ జైళ్లో ఉన్నాడు. కాగా.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సోమవారం నిఖిల్ ను న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. తమదేశంలోనే పన్నూ హత్యకు కుట్ర జరిగిందని అమెరికా పేర్కొంది. ఆ ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు వెల్లడించింది. భారతప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూని హత్య చేసేందుకు నిఖిల్ సుపారీ ఇచ్చారని అమెరికా పేర్కొంది.

అమెరికా సూచనల మేరకే గుప్తా అరెస్టు

గతేడాది జూన్ 30న విహారయాత్రకోసం చెక్ రిపబ్లిక్ వెళ్లిన తనను ఎయిర్ పోర్టులో చేశారని గుప్తా ఓ పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా సూచనల మేరకే తాముగుప్తాను అరెస్టు చేసినట్లు చెక్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు. పన్నూ హత్య కుట్ర కేసులో తమ పాత్ర ఏమీ లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. తనకు కూడా ఎలాంటి సంబంధం లేదని నిఖిల్ గుప్తా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనని అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. అమెరికా ఒత్తిడి మేరకు చెక్‌ రిపబ్లిక్‌ అధికారులు తప్పుడు న్యాయ సలహాలతో తనని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తమ లాయర్ రోహిణి మూసా ద్వారా కోర్టుకు వెల్లడించారు. త్వరలో భారత్ పర్యటనకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ రానున్నారు. ఆయనలో అజిత్ దోబాల్ సమావేశం కానున్నారు. ఆ భేటీలో నిఖిల్ గుప్తా గురించి చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో నిఖిల్ గుప్తాను అమెరికాకు తరలించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed