భట్టి ఎంపీ అయితే బాగుండు.. అసెంబ్లీలో కేసీఆర్ కామెంట్

by GSrikanth |
భట్టి ఎంపీ అయితే బాగుండు.. అసెంబ్లీలో కేసీఆర్ కామెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్రం విధానాలపై భట్టి చాలా ఆవేశంగా మాట్లాడారని, కానీ అసెంబ్లీలో మాట్లాడడం ద్వారా ప్రయోజనమేంటని వ్యాఖ్యానించారు. ఆయన ఎంపీ అయితే కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదికగా తూర్పారా బట్టవచ్చని, ఎంపీ కావాలని కోరుకుందామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటుపరం చేయాలన్న కేంద్రం తీరును భట్టి ఎండగట్టడం తనకు సంతోషమే అయినా ఇది సరైన వేధిక కాదన్నారు. ఆయన ఆవేదనను మనం గుర్తించాలన్నారు.

Next Story

Most Viewed