ఆమె ఓ డైమండ్ రాణి..ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజాను ఆడేసుకున్న బండ్లగణేష్!

by Jakkula Samataha |
ఆమె ఓ డైమండ్ రాణి..ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజాను ఆడేసుకున్న బండ్లగణేష్!
X

దిశ, సినిమా : బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన నిర్మాతగా మారి చాలా సినిమాలు తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. తర్వాత చిత్రపరిశ్రమకు దూరమై, రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఈయన పవన్‌కు వీరాభిమాని. ఎప్పుడు ఆయన్ను ఓ దేవుడిలా కొలుస్తుంటారు. అంతే కాకుండా జనసేనకు చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతాడు.

అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 21 సీట్లకు 21 సీట్లు గెలిచి, తన సత్తా చాటుకుంది. ఇక నగరి ఎమ్మెల్యే రోజా ఓడిపోయారు. గతంలో రోజా.. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయారు, ఆయన అసెంబ్లీ గేటును కూడా టచ్ చేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఎన్నికల్లో ఓడిపోవడం తో బండ్ల గణేష్ రోజాపై సెటైర్లు వేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రోజా వందకు వంద శాతం స్కాం చేసే ఉంటారని ఆరోపించారు. ఆమె స్కాముల్లో డైమండ్ రాణి, ఒక 100 కోట్లే కాదు, ఆవిడపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి, తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించినందుకు డబ్బులు వసూలు చేసేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.Next Story

Most Viewed