ధాన్యం డబ్బులతో ఆన్‌లైన్ బెట్టింగ్‌.. నష్టపోయి యువకుడు సూసైడ్

by Rajesh |
ధాన్యం డబ్బులతో ఆన్‌లైన్ బెట్టింగ్‌.. నష్టపోయి యువకుడు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధాన్యం అమ్మిన డబ్బు రూ.లక్షన్నరను భాను ప్రకాష్ అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి నష్టపోయాడు. దీంతో మనస్థాపానికి గురై ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భాను ప్రకాష్(24) ఇవాళ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Next Story

Most Viewed