బీఆర్ఎస్‌ను చాలా ఈజీగా ఓడిస్తాం: Rahul Gandhi

by GSrikanth |
బీఆర్ఎస్‌ను చాలా ఈజీగా ఓడిస్తాం: Rahul Gandhi
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘జన గర్జన’ సభకు రాహుల్ హాజరయ్యారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వీడిన నేతలంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను చాలా ఈజీగా ఓడిస్తామని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చూపించారని, ఇక్కడ కూడా అదే రిపీట్ కాబోతోందని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని, బీజేపీ బీఆర్ఎస్‌కు బీ-టీమ్‌గా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. మొన్న దేశంలో జరిగిన విపక్షాల సమావేశానికి అన్ని పార్టీలు కేసీఆర్‌ను ఆహ్వానించాలని కోరాయని, తాము మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు గుర్తుచేశారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్‌కు ఇవి చివరి రోజులని, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు.

Read More..

కేసీఆర్ కుటుంబాన్ని అండమాన్ జైలుకు పంపుతాం.. ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి

Next Story

Most Viewed